డి.ఐ పనుల్లో నిమగ్నమైన భాయ్ చిత్రం

డి.ఐ పనుల్లో నిమగ్నమైన భాయ్ చిత్రం

Published on Aug 2, 2013 4:10 AM IST

nag-bhai-itemsong

‘కింగ్’ అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ సినిమా ప్రొడక్షన్ దశలోవుంది. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధంగావుంది. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను సైతం సమాంతరంగా పుర్తిచేసుకుంటుంది. ఇప్పటివరకూ తెరకెక్కించిన సన్నివేశాలకు ప్రస్తుతం డి.ఐ పనులు జరుగుతున్నాయి

రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో సంయుక్తంగా నాగార్జున అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రిచా గంగోపాధ్యాయ ఈ సినిమాలో హీరోయిన్. వీరభద్రమ్ చౌదరి దర్శకుడు

దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతంపై అంచనాలు భారీ రీతిలో వున్నాయి. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆగష్టులో విడుదలకానుంది

తాజా వార్తలు