భాయ్ బులెట్స్ కు ప్రేక్షకాదరణ

భాయ్ బులెట్స్ కు ప్రేక్షకాదరణ

Published on Aug 12, 2013 10:45 PM IST

Bhai
‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందింది. ఈ పోస్టర్లలో చాలా యంగ్ గా మరియు స్టైలిష్ గా కనిపించాడు.

ఈ లుక్స్ యే కాకుండా వీరు ప్రారంభించిన ‘భాయ్ బులెట్స్’ ప్రేక్షకులకు చేరువైంది.ఇంతకూ ఈ ‘భాయ్ బులెట్స్’ అంటే ఏంటో అనుకుంటున్నారా?? అవి ఈ సినిమాలో డైలాగులు

“6 వరకే నేను భాయ్.. ఆ తరువాత ప్లే బాయ్”… “అట్మాస్ఫియర్ వయలేంట్ గా వుందంటే ఫీల్డ్ లోకి భాయ్ ఎంటర్ అయినట్టే … “హైదరాబాద్ లో ఫేమస్ అయినవి రెండే.. ఒకటి ఇరానీ చాయ్.. రెండు ఈ భాయ్” వంటి పంచ్ డైలాగులు ఈ సినిమాలో వున్నాయి

వీరభద్రమ్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సెప్టెంబర్లో విడుదలకానుంది

రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నాగార్జున ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు