‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘భాయ్’ సినిమా ఆడియో రిలీజ్ వేడుకని ఆగష్టు 16న ప్లాన్ చేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ డేట్ ని పరిశీలిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘భాయ్’ సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని అందరూ భావిస్తున్నారు.
వీరభద్రం చౌదరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని నాగార్జున తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున సరసన మొదటిసారి రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా జోడీ కట్టింది. కామెడీ పై మంచి గ్రిప్ ఉన్న వీరభద్రం డైరెక్షన్ లో వస్తున్న ‘భాయ్’ సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగున్నాయి.