మార్చ్ 21న విడుదలకానున్న భద్రమ్

మార్చ్ 21న విడుదలకానున్న భద్రమ్

Published on Mar 8, 2014 11:20 PM IST

bhadram1
అశోక్ సెల్వన్, జనని ఐయెర్ నటించిన భద్రమ్ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. ఈ సినిమా తెగిడి అనే తమిళ సినిమాకు డబ్బింగ్ వెర్షన్. తమిళంలో ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి రివ్యూలను అందుకుంది, ఈ తెలుగు వెర్షన్ ని శ్రేయాస్ మీడియా మరియు రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు

ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ గా రూపుదిద్దుకుంది. డిటెక్టివ్ కావాలనుకున్న ఒక కాలేజి విద్యార్ది చుట్టూ తిరిగే కధ ఇది. పిజ్జా సినిమాను తీసినటువంటి సంస్థ తమిళంలో ఈ సినిమాను నిర్మించింది. తెలుగులో కూడా ఈ చిత్రం తప్పకుండ విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకంగా వున్నారు

నివాస్ కె ప్రసన్న సంగీత దర్శకుడు. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు