లాక్ డౌన్ ముందు వరకు ఎన్టీఆర్ ప్లాన్స్ అదిరిపోయాయి. ఆయన ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇస్తారని అందరు అనుకున్నారు. ఐతే కోవిడ్ ఆ ప్లాన్స్ మొత్తం తారుమారు చేసింది. ఆర్ ఆర్ ఆర్ కారణంగా ఎన్టీఆర్ 2019 లో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక 2020 నుండి ఆర్ ఆర్ ఆర్ విడుదల 2021 జనవరికి వాయిదా కావడంతో 2020 కూడా ఎన్టీఆర్ కి జీరో ఇయర్ గా మిగిలిపోయింది. ఎప్పుడూ లేని విధంగా ఎన్టీఆర్ నుండి రెండేళ్లు సినిమాలు లేకుండా పోనున్నాయి. ఐతే త్రివిక్రమ్ తో మూవీ ప్రకటించిన ఎన్టీఆర్ అది కూడా ఆర్ ఆర్ ఆర్ తో పాటు పూర్తి చేసిన 2021లో నెలల వ్యవధిలో రెండు సినిమాలు విడుదల చేస్తారని చెప్పారు.
కాగా లాక్ డౌన్ తో ఈ ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. ఎన్టీఆర్ ముందున్న తక్షణ కర్తవ్యం ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేయడం, ఆ తరువాతే త్రివిక్రమ్ మూవీ ఉంటుంది. ఇటు 2021 సమ్మర్ తరువాతే ఆర్ ఆర్ ఆర్ విడుదల అయ్యే అవకాశం కలదు. త్రివిక్రమ్ మూవీ షూట్ అప్పుడు మొదలైనా ఆ మూవీ వచ్చేది 2022 లోనే. కాబట్టి ఎన్టీఆర్ నుండి 2021 లో డబుల్ ట్రీట్ అనేది దాదాపు కష్టమే అని తెలుస్తుంది.