కాస్త విరామం తర్వాత మిల్క్ బ్యూటీ తమన్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి తన ఇన్నింగ్స్ ని మొదలు పెట్టనుంది. ప్రస్తుతం ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించడానికి సిద్దమవుతోంది. ఆగడు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ బిజీ అయిపోతానని తమన్నా ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజాగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన బైట్ లో తమన్నా మాట్లాడుతూ ‘ నటన అనేది అంత సులువైన విషయం కాదు. నటన అనేది చాలా సులువైనది అనుకుంటారు. షూటింగ్ అనేది ఎప్పుడూ పిక్నిక్ లా సాగిపోదు. సెట్లోని ప్రతి ఒక్కరూ సినిమా బాగా రావాలని కష్టపడుతుంటారు. నటీనటులు కాంబినేషన్ సీన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని శ్రద్దగా చేయాల్సి ఉంటుంది. సినిమా అంటే చాలా పని ఉంటుంది. ఎవరైతే కెమెరా ముందుకు వచ్చి నటిస్తారో వారికే అద అర్ధమవుతుందని’ అంది.
అభిమానులు మహేష్ బాబు – తమన్నా కాంబినేషన్లో సినిమా కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. తమ్మా చేసే కృషి తనకి ఫలితాన్ని ఇస్తుందని ఆశిద్దాం..