శివరాత్రి కానుకగా రానున్న ‘బసంతి’

basanti
కామెడీ కింగ్ బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా – ‘బాణం’ ఫేం చైతన్య దంతులూరి కాంబినేషన్లో ‘బసంతి’. చాలా సరికొత్తగా ఈ సినిమా ప్రమోషన్స్ చెయ్యడం వల్ల సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరూ ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

‘బసంతి’ సినిమా మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ చాలా మంది మార్చికి వాయిదా పడే అవకాశం ఉందని పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ చిత్ర టీం మాత్రం 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటోంది.

ఆలీషా బైగ్, నవీనా జాక్సన్ హీరోయిన్స్ గా నత్తిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు.
చైతన్య దంతులూరి దర్శకత్వంతో పాటు నిర్మాతగా బాధ్యతలు తీసుకున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహా నిర్మాత.

Exit mobile version