మార్చ్ కు మారిన బసంతి?

basanti1

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ‘బసంతి’ సినిమా రూపంలో తన రెండో ఇన్నింగ్స్ కు సిద్ధమయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ముగించుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా బృందమంతా ప్రచారంలో బిజీగా వున్నారు

ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరి చివరివారంలో మనముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న ‘టి’ గొడవల మూలాన ఈ సినిమాను మార్చ్ కు వాయిదా వేసే ఆలోచనలో వున్నారు. అధికారిక నిర్ణయం త్వరలో తెలుపుతారు

ఈ సినిమాలో అలీషా భాగ్, నవీనా జాక్సన్ హీరోయిన్స్. చైతన్య దంతులూరి దర్శకుడు. మణిశర్మ సంగీతాన్ని అందించారు.రాజకీయాలలో యువత ప్రాధాన్యత అన్న ఆలోచన ఆధారంగా ఈ సినిమా కధ తెరకెక్కనుంది.

Exit mobile version