రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా మరియు ఇలియానా ప్రధాన పాత్రలలో వచ్చిన చిత్రం “బర్ఫీ” వచ్చే ఏడాది ఆస్కార్ కి భారతదేశం నుండి పంపుతున్న చిత్రం అయ్యింది. ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జ్యూరి చైర్ పర్సన్ అయిన మంజు బోరా మాట్లాడుతూ “దాదాపుగా 20 వివిధ భాషల చిత్రాలు చూడగా “బర్ఫీ” చిత్రాన్ని ఆస్కార్స్ కి ఎంపిక చెయ్యడం జరిగింది ఈ చిత్రంలో భారతీయ సంప్రదాయాన్ని బాగా చూపించడమే కాకుండా చిత్రంలో మంచి హృద్యమయిన కథ ఉంది” అని అన్నారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ మూగ మరియు బధిరుడి పాత్రలో కనిపించారు. ప్రియాంక చోప్రా మానసిక వికలంగురాలి పాత్రలో కనిపించింది. ఇలియానా బెంగాలి అమ్మాయి పాత్రలో కనిపించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టుతుంది. రొన్ని స్క్రువాలా మరియు సిద్దార్థ్ రాయ్ కపూర్ ఈ చిత్రాన్ని యుటివి మోషన్ బ్యానర్ మీద నిర్మించారు, ఇలియానా ఈ చిత్రంతో బాలివుడ్ లో అడుగుపెట్టింది చూస్తుంటే ఆమె బాలివుడ్ భవిష్యత్తు చాలా బాగుండేలా అనిపిస్తుంది.
ఆస్కార్ రేస్ లో బర్ఫీ
ఆస్కార్ రేస్ లో బర్ఫీ
Published on Sep 22, 2012 10:50 PM IST
సంబంధిత సమాచారం
- పోల్ : ‘మిరాయ్’ ట్రైలర్ మీకెలా అనిపించింది?
- ట్రైలర్ టాక్: గ్రాండ్ ట్రీట్ ఇవ్వడానికి రాబోతున్న ‘మిరాయ్’
- మరో ఓటిటిలోకి కూడా వచ్చిన నితిన్ రీసెంట్ సినిమా!
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- మళ్లీ పవన్ కళ్యాణ్ మేనియా.. ‘ఓజి’తో జానీ డేస్ వెనక్కి
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘స్పిరిట్’పై క్రేజీ బజ్.. ఇది మామూలు ట్విస్టు కాదుగా..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!