సుకుమార్-బన్నీ మూవీకి బ్రేక్..కారణం అదే..!

సుకుమార్-బన్నీ మూవీకి బ్రేక్..కారణం అదే..!

Published on Mar 14, 2020 8:30 PM IST

కరోనా వైరస్ ప్రభావం చిత్ర పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. దీని వ్యాప్తిని ఆర్టికట్టేందుకు ప్రభుత్వాలు విద్యా సంస్థలు, సినిమా థియేటర్స్ కి బంధు ప్రకటించాయి.ఇక నాని హీరోగా తెరకెక్కిన ‘వి’ మూవీ వాయిదాపడింది. ఉగాది కానుకగా ఈనెల 25న రావాల్సిన ఈ చిత్ర విడుదల వాయిదావేస్తున్నట్లు నేడు నిర్మాతలు ప్రకటించారు. అలాగే జూన్ లేదా జులై లో రావాల్సిన కెజిఎఫ్ కూడా ఏకంగా అక్టోబర్ కి వాయిదా వేయడం జరిగింది. ఈ పరిస్థితులలో పవన్ సినిమా వకీల్ సాబ్ కూడా వాయిదాపడే అవకాశం కలదు.

కాగా అల్లు అర్జున్-సుకుమార్ మూవీ షూటింగ్ కూడా బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. కొద్దిరోజులల్లో కేరళలో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలుకావాల్సివుండగా కేరళ ప్రభుత్వం నుండి అనుమతులు రావడం కష్టంగా ఉంది. కేరళలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీనితో చిత్ర యూనిట్ సైతం అక్కడ షూటింగ్ జరపడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. కాబట్టి కొద్దిరోజులు ఈ చిత్ర షూటింగ్ కి బ్రేక్ పడే అవకాశం కలదు.

తాజా వార్తలు