ఈ ఏడాదికి ఆ రికార్డు బన్నీదే..?

ఈ ఏడాదికి ఆ రికార్డు బన్నీదే..?

Published on Jun 11, 2020 9:13 AM IST

2020 తెలుగు చిత్ర పరిశ్రమకు పీడ కలలా తయారైంది. చిత్ర పరిశ్రమ మొదలయ్యాక ఇంతటి క్లిష్ట పరిస్థితి ఎవరూ చూసి వుండరు. ఇక ఈఏడాది సంక్రాంతి సినిమాలతో మంచి ఆరంభం లభించింది. మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురంలో రికార్డు వసూళ్లు దక్కించుకున్నాయి. ముఖ్యంగా అల వైకుంఠపురంలో నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో బన్నీ రికార్డు బద్దలయ్యే ఆస్కారం లేదు.

లాక్ డౌన్ పరిస్థితుల రీత్యా పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది. ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు ఈ ఏడాది తమ లేటెస్ట్ మూవీస్ విడుదల చేద్దామన్నా అది కుదిరే పరిస్థితి లేదు. ఇక ఎన్టీఆర్, చరణ్ కలసి నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాదికి రానున్న సంగతి తెలిసిందే. మిగిలిన మహేష్ జస్ట్ ఇప్పుడే కొత్త మూవీ ప్రకటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒక్క చిరంజీవి మాత్రమే ఆచార్య సినిమాతో 2020లో వచ్చే అవకాశం కలదు. అది కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. పవన్ వకీల్ సాబ్ షూటింగ్ కూడా పూర్తి కాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఒక వేళ చిరు, పవన్ సినిమాలు వచ్చినా గతంలోలా భారీగా వసూళ్లు దక్కుతాయన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఈ ఏడాది బన్నీ నాన్ బాహుబలి రికార్డు చెదరకపోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు