సుకుమార్ సినిమా కోసం గడ్డం పెంచుతున్న బన్నీ

అల వైకుంఠపురంలో మూవీ విజయం బన్నీని ఎక్కడికో తీసుకెళ్లింది. ఆయన ఊహించని ఎన్నో రికార్డ్స్ ఆయన ఖాతాలో వచ్చి చేరాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డ్స్ సొంతం చేసుకుంది. ఇక అల వైకుంఠపురంలో విజయాన్ని బన్నీ భారీ ఎత్తున జరుపుకుంటున్నారు. కాగా కొద్దిరోజులలో బన్నీ తన ఇరవైయ్యవ చిత్రంగా సుకుమార్ తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. కాగా ఈ చిత్రంలో బన్నీ లుక్ పై ఆసక్తికరమైన న్యూస్ బయటికి వచ్చింది.

సుకుమార్ చిత్రంలో బన్నీ ఒత్తైన గడ్డంలో కనిపిస్తాడట, అలాగే కొంచెం బొద్దుగా కనిపించడానికి కండలు కూడా పెంచుతున్నాడని తెలుస్తుంది. రీసెంట్ గా బన్నీ కనిపించిన ఫోటోలలో కూడా ఆయన కొంచెం గడ్డంలో కనిపిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రాన్ని గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇక బన్నీ పాత్ర కూడా చాలా రఫ్ అండ్ మాస్ గా ఉంటుందని తెలుస్తుంది. దాదాపు బన్నీ డీగ్లామర్ గా కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, రష్మీక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.

Exit mobile version