పవన్ భక్తుడు కోరిక ఇప్పట్లో తీరడం కష్టమే..!

కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పవర్ స్టార్ వీరాభిమాని. చాలా మంది ఆయన్ని పవన్ భక్తుడు అని పిలుస్తూ ఉంటారు. పవన్ తో బండ్ల గణేష్ రెండు సినిమాలు చేశారు. మొదటి సినిమా తీన్ మార్ ఆశించిన విజయం సాధించలేదు. తరువాత దబంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ మూవీ చేయడం జరిగింది. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ మూవీ తరువాత వీరిద్దరూ కలిసి మూవీ చేయలేదు.

ఐతే బండ్లగణేష్ మాత్రం పవన్ తో మరో సినిమా చేయాలని చాలా కోరికతో ఉన్నాడు. నేడు కూడా ట్విట్టర్ సాక్షిగా పవన్ అవకాశం ఇస్తే ఫ్యాన్స్ కి పండగలాంటి మూవీ తీస్తాను అంటున్నాడు. గణేష్ ఎంత ఆరాట పడినా ఇప్పట్లో పవన్ మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యే అవకాశం లేదు. ఎన్ని చిత్రాలు చేసినా అది కేవలం 2024 లోపే. లాక్ డౌన్ కారణంగా ఒప్పుకున్న మూడు చిత్రాలు పూర్తి చేయడానికే పవన్ కి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇప్పట్లో బండ్ల గణేష్ కోరిక తీరక పోవచ్చు.

Exit mobile version