బన్నీని పొగడ్తలతో ముంచెత్తిన బండ్ల గణేష్

బన్నీని పొగడ్తలతో ముంచెత్తిన బండ్ల గణేష్

Published on Apr 7, 2013 8:31 PM IST

Allu-arjun-and-Bandla-Ganes
ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ బార్సెలోనాలో జరిగింది. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో బన్ని ఇచ్చిన సపోర్ట్ గురించి బండ్ల గణేష్ పొగడకుండా ఉండలేకపోతున్నారు. జరిగిపోయిన రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ ‘ బార్సెలోనాలో షూటింగ్ జరిగే సమయంలో నేను దూరం నుంచి షూటింగ్ చూస్తున్నా అల్లు అర్జున్ తన షాట్ అయిపోగానే నా దగ్గరికి వచ్చి నువ్వు వెళ్లి ‘బాద్ షా’ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టు, ‘ఇద్దరమ్మాయిలతో’ ప్రొడక్షన్ విషయాలు నేను చూసుకుంటానని ప్రామిస్ చేసారు. పనిపట్ల అతనికి ఉన్న శ్రద్ధ, అంకిత భావానికి హాట్సాఫ్. తన తండ్రిగారు కూడా ఒక నిర్మాత అవ్వడం వల్లే తను ఒక నిర్మాత పడే బాధని అర్థం చేసుకోగలిగాడని అనుకున్నాను. బన్ని తో మళ్ళీ మళ్ళీ పనిచేయాలనుకుంటున్నాను. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలనని’ అన్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా పూరి జగన్నాథ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని బండ్ల గణేష్ అన్నారు. అలాగే మాట్లాడుతూ ‘ ఈ సినిమాకి చాలా కెపాసిటీ ఉంది. పూరి జగన్నాథ్ పోకిరి సినిమాలాగే బాక్స్ ఆఫీసు వద్ద హిట్ నమోదు చేస్తుందని’ అన్నారు. అల్లు అర్జున్ కెరీర్లో మోస్ట్ స్టైలిష్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కాస్ట్యూమ్స్ కోసం బండ్ల గణేష్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏప్రిల్ మూడవ వారంలో ఆడియో విడుదల కానున్న ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు