పోర్చుగల్లో స్టెప్పులేస్తున్న రవితేజ

పోర్చుగల్లో స్టెప్పులేస్తున్న రవితేజ

Published on Apr 9, 2013 9:58 PM IST

Balupu

తెలుగు సినిమా నిర్వాహకులు తమ సినిమాలను కొత్త కొత్త లోకేషన్స్ లో షూట్ చేయాలనుకుంటారు. ఈ సమయంలో చూడడానికి యురోపియన్ దేశాలు చాలా బాగుంటాయి. ఇప్పటికే స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ లాంటి అందమైన లోకేషన్స్ నిమనకు చూపించారు ఈ సారి రవితేజ హీరోగా వస్తున్న ‘బలుపు’ సినిమాలో కొంత భాగాన్ని మొదటిసారిగా పోర్చుగల్ లో షూట్ చేస్తున్నారు. కొన్ని పాటలను పోర్చుగల్ రాజదాని లిస్బన్ లో షూట్ చేశారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ ‘బలుపు’ సినిమాలో రవితేజ హీరోగా, శృతి హసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా ఆడియోని త్వరలో విడుదల చేసే అవకాశం వుంది. చాలారోజుల తర్వాత రవితేజ ఈ సినిమాలో పూర్తి మాస్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలోని రవితేజను చూస్తుంటే వెంకీ సినిమాలో ఉన్నట్టుగా వున్నాడు. ఈ సినిమాలో శృతి హసన్ గ్లామర్ పాత్రలో, అంజలి మెడికల్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో చాలా బాగం విశాఖపట్నం, హైదరాబాద్ లో షూట్ చేశారు. ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ సమ్మర్ తరువాత విదుదలైయ్యో అవకాశం వుంది.

తాజా వార్తలు