హైదరాబాద్ కి మారిన రవితేజ ‘బలుపు’ షూటింగ్

హైదరాబాద్ కి మారిన రవితేజ ‘బలుపు’ షూటింగ్

Published on Jan 6, 2013 10:47 AM IST

Ravi-teja
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘బలుపు’ సినిమా మూడవ షెడ్యూల్ హైదరాబాద్లో మొదలు కానుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో రవితేజ ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు. ఎక్కువ భాగం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే సింహాచలం పరిసర ప్రాంతాల్లో రవితేజ – అంజలి పై కొన్ని సన్నివేశాలను షూట్ చేసారు. తాజా షెడ్యూల్లో రవితేజ – శృతి మీద కొన్ని సీన్స్ షూట్ చేయనున్నారు.

రవితేజ – శృతి మొదటి సారి జోడీ కట్టిన ఈ సినిమాలో శృతి కామెడీ, గ్లామర్ కి ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషిస్తోంది. ‘బలుపు షూటింగ్ కోసం హైదరాబాద్ బయలుదేరాను. సెట్స్ కి వెళ్ళనుండడం చాలా ఆనందంగా ఉందని’ శృతి ట్వీట్ చేసింది. గోపి చంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు