త్వరలో బలుపు ఫస్ట్ లుక్

త్వరలో బలుపు ఫస్ట్ లుక్

Published on Jan 14, 2013 10:00 PM IST

raviteja-in-balupu
రవితేజ రానున్న చిత్రం “బలుపు” ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. శృతి హాసన్ ప్రధాన కథానాయికగా నటిస్తుండగా అంజలి రెండవ కథానాయిక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇటీవల హైదరాబాద్లో రవితేజ మరియు శృతి హసన్ ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకుంది. వైజాగ్ నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో “వెంకి” చిత్రం తరువాత రవితేజ మాస్ గా కనిపించనున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్ వి పోట్లురి పివిపి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని గోపీచంద్ మలినేని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో అడవి శేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు