ఆగస్ట్ 8న “బాలుగాడి లవ్ స్టోరీ” విడుదల – ప్రీ-రిలీజ్ వేడుకలో చిత్ర బృందం సందడి!

ఆకుల అఖిల్, దర్శిక మీనన్ జంటగా నటించిన “బాలుగాడి లవ్ స్టోరీ” చిత్రం ఆగస్ట్ 8న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో, ఆకుల మంజుల నిర్మించిన ఈ చిత్రానికి యల్. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌తో పాటు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు, శబరి నిర్మాత మహేంద్రనాథ్, మా అసోసియేషన్ ఈసీ మెంబర్ మానిక్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ, “బాలుగాడి లవ్ స్టోరీ టైటిల్, పాటలు బాగున్నాయి. కొత్త నిర్మాతలు, దర్శకులకు ఇండస్ట్రీ ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత ఆకుల మంజుల మాట్లాడుతూ, “మా అబ్బాయి అఖిల్, దర్శకుడు శ్రీనివాస్ తేజ్, నేను… మా అందరికీ ఇది మొదటి సినిమా. ఈ సినిమా విజయం సాధించి మాకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను” అన్నారు.
నిర్మాత ఆకుల భాస్కర్ మాట్లాడుతూ, “నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు శ్రీనివాస్ తేజ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఘన శ్యామ్ గారు మంచి పాటలు ఇచ్చారు. ఆగస్ట్ 8న థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అని కోరారు.
దర్శకుడు యల్. శ్రీనివాస్ తేజ్ మాట్లాడుతూ, “చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాను. ఈ సినిమాలో కామెడీ, లవ్, యాక్షన్ అన్నీ ఉన్నాయి. నటీనటులు చాలా బాగా చేశారు. అఖిల్‌కు మీ అందరి ఆదరణ కావాలి” అన్నారు.
హీరో ఆకుల అఖిల్ మాట్లాడుతూ, “మేము ఎంతో ఎదురుచూస్తున్న ‘బాలుగాడి లవ్ స్టోరీ’ ఆగస్ట్ 8న వస్తోంది. ప్రేక్షకులు మా సినిమాకు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. మాకు మీ సపోర్ట్ కావాలి” అని కోరారు.

Exit mobile version