నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తనకు అచొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్నాడు. మోనార్క్ అనే టైటిల్ ప్రచారం అవుతుండగా బాలయ్యను బోయపాటి కొత్తగా ఆవిష్కరించనున్నాడని సమాచారం. ఇప్పటికే బోయపాటి ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. కాగా ఈ చిత్రం తరువాత బాలకృష్ణ చేసే ప్రాజెక్ట్స్ గురించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మలయాళ హిట్ మూవీ రీమేక్ లో బాలకృష్ణ హీరోగా నటించనున్నాడు అనే వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉంది.
ఐతే ఇందులో ఎటువంటి నిజం లేదని హీరో బాలకృష్ణ స్పష్టం చేశారు. ఐతే తను ఆదిత్య 369కి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాను అన్నారు. దర్శకుడు సింగీతం శ్రీనివాస రావుతో ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 చేస్తారట. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం పట్టాలెక్కితో బాలయ్య కెరీర్ లో మరో బెస్ట్ మూవీ చేరినట్టే.