బాలయ్య సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ ?

బాలయ్య సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ ?

Published on Apr 14, 2020 12:03 PM IST

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో బాలయ్య ఇప్పటికే శ్రియా సరన్ ను రికమండ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఓ కీలక పాత్ర కోసం టాలెంటెడ్ యాక్టర్ రావు రమేష్‌ను కూడా సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది టీం. శ్రియా సరన్ ను సెకెండ్ హీరోయిన్ పాత్ర కోసం తీసుకున్నారు. ఇప్పటికే శ్రియా బాలయ్య సరసన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమాలో బాలయ్య డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే గుండుతో పాటు ఫుల్ మీసంతో ఉన్న ఫోటో బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు