‘లెజెండ్’ విజయంతో సంతోషంగా ఉన్న ఫాన్స్

legend-censor-details

నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రం భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదల అయ్యింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించడం తో, గత కొద్ది రోజులుగా విజయం కోసం ఎదురుచూస్తున్న నందమూరి అభిమానుల్లో ఈ చిత్రం సంతోషాన్ని నింపింది.

ఎన్నో అంచనాల మధ్య బోయపాటి, బాలయ్య హిట్ కాంబినేషన్ లో విడుదల అయిన ఈ చిత్రం అభిమానులు కోరుకున్న విధంగా ఉండటంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ చిత్ర విజయంతో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

బాలయ్య ద్విపాత్రాభినయం తో తెరకెక్కించిన ఈ చిత్రంలో బోయపాటి అభిమానులను నిరాశ పరచలేదు. అభిమానులు కోరుకున్నట్లు గానే బాలయ్య ట్రేడ్ మార్క్ డైలాగ్స్, ఫైట్స్ , డాన్సు లు అన్నింటిని దర్శకుడు బోయపాటి అందించారు. మాస్ ఎంటర్టైనర్ గా ఉన్న ఈ చిత్రం సినీ ప్రేక్షకులను మరో సారి థియేటర్స్ కు రప్పించే విధంగా ఉంది.

Exit mobile version