లెజెండ్ తో బాలయ్య బాబు టెంపర్ లేపనున్నాడా?

లెజెండ్ తో బాలయ్య బాబు టెంపర్ లేపనున్నాడా?

Published on Mar 8, 2014 2:51 PM IST

2nd-look-poster-LEGEND-pla
బాలకృష్ణ కధానాయకుడిగా రానున్న లెజెండ్ ట్రైలర్ నిన్న విడుదలై సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాలో పంచ్ డైలాగ్ లకు, రాజకీయ నేపధ్యానికి ఏమాత్రం లోటు లేదని ట్రైలర్ నిరువుపించింది.

“ఈ సినిమా యాక్షన్ చిత్రమా, పొలిటికల్ చిత్రమా అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. ఇది ఒక డిక్టేటర్ కధ. తానూ నడుస్తున్న దారిలో ఎదురొస్తున్న వారిని తాట తీస్తాడు. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు ప్రధానఆకర్షణ. జగపతిబాబు నెగిటివ్ రోల్ పోషించడం కూడా మా అదృష్టం” అని బోయపాటి తెలిపాడు. బాలకృష్ణ మాట్లాడుతూ “మా నాన్నగారు ఎన్.టి.ఆర్ నిజమైన లెజెండ్ అని, ఆయనే తెలుగు వారి ఖ్యాతిని పెంచారని” తెలిపారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన నాటినుండీ బాలయ్య బాబు సంభాషణలకోసం, రాజసమైన నటనకోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. చూస్తుంటే వారికి ఈ మార్చ్ 28 లెజెండ్ ద్వారా కడుపునిండిపోనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

తాజా వార్తలు