కొత్తదనం బాలయ్యకు కలిసి వస్తోందా ?

కొత్తదనం బాలయ్యకు కలిసి వస్తోందా ?

Published on Apr 5, 2020 10:00 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా నటిస్తున్నాడట. అందుకే బాలయ్య గుండు లుక్‌ లో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే సినిమాలో బాలయ్య కొన్ని సీక్వెన్స్ లో అఘోరాగా కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి కొత్తదనం బాలయ్యకు కలిసి వస్తోందా ? అనేది బాలయ్య ఫ్యాన్స్ కు మిగుడు పడట్లేదు.

ఇక నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. అన్నట్టు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రటినాయకుడి పాత్ర చేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు