బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల కానున్న “బస్ స్టాప్” ఆడియో

బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల కానున్న “బస్ స్టాప్” ఆడియో

Published on Oct 13, 2012 1:00 PM IST


ప్రిన్స్ మరియు శ్రీదివ్య ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “బస్ స్టాప్” ఆడియో విడుదల వేడుక శిల్పకళావేదికలో భారీ ఎత్తున జరుగుతుంది. గతంలో “ఈ రోజుల్లో” చిత్రాన్ని తెరకెక్కించిన మారుతీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియోని బాలకృష్ణ మరియు సమంత ఆవిష్కరించనున్నారు. ఆసక్తికరంగా గతంలో “ఈరోజుల్లో” చిత్ర ఆడియో ని అల్లు అర్జున్ మరియు రిచా గంగోపాధ్యాయ్ ఆవిష్కరించారు.బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో వస్తున్న చిత్రం కావడంతో ఈ కార్యక్రమానికి పలువురు పెద్దలు హాజరవుతున్నారు. సాయికుమార్ పంపాన,ఖన్నా,హసిక, అభి, గోపాల్ సాయి మరియు రావు రమేష్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి అద్భుతమయిన స్పందన కనిపించింది. ఈ చిత్రం కూడా విజయం సాదిస్తుంది అని మారుతీ ధీమాగా ఉన్నారు. జేబీ సంగీతం అందించిన ఈ చిత్రానికి జే ప్రభాకర్ సినిమాటోగ్రఫీ అందించారు..

తాజా వార్తలు