అలనాటి నటి సరోజాదేవి మృతిపై విచారం వ్యక్తం చేసిన బాలకృష్ణ

అలనాటి నటి సరోజాదేవి మృతిపై విచారం వ్యక్తం చేసిన బాలకృష్ణ

Published on Jul 14, 2025 3:02 PM IST

ప్రముఖ నటి బి.సరోజాదేవి మరణించిన వార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. 1938లో జన్మించిన సరోజాదేవి 1955లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఇక కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమె 200కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమె మృతిపై హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు.

ఆమె మృతి భారత సినీ పరిశ్రమకు తీరని లోటని.. అప్పట్లో తెలుగులో ఎన్టీఆర్‌తో, తమిళంలో MGRతో, కన్నడలో రాజ్ కుమార్‌తో ఏకకాలంలో హిట్ పెయిర్‌గా వెలుగొందిన ఘనత ఆమె సొంతమని బాలకృష్ణ పేర్కొన్నారు. తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి 20 సంవత్సరాల్లో 20 చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారని ఆయన పేర్కొన్నాడు.

సరోజాదేవి లాంటి నటిని కోల్పోవడం బాధాకరం అని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు బాలయ్య తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు