నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో శరవేగంగా జరుగుతోంది. దుబ్బాయ్ లో ఈ నెల 22 వరకూ షూటింగ్ జరుపుకోనుంది. మరో వైపు ఈ చిత్ర టీం త్వరలో టీజర్ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తోంది. బాలకృష్ణ షూటింగ్ పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి రాగానే ఈ టీజర్ లాంచ్ చేయాలని ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. కావున ఈ నెలాఖరు లోపు ‘లెజెండ్’ ఎలా ఉండబోతుంది అనే ఓ సాంపుల్ ని అభిమానులకు చూపించనున్నారు.
దుబాయ్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించనున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను డైరెక్టర్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మార్చి 7న ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసి మార్చి చివర్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.