నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న సినిమా షూటింగ్ లో పాల్గొనడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మొదటగా రామ్ – లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ నేతృత్వంలో బాలకృష్ణ పై ఇంట్రడక్షన్ ఫైట్ ని తెరకెక్కించారు. ఈ సినిమా పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు. మొదటగా ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో మొదలవ్వాలి కానీ అక్కడ అనుమతులు కాస్త లేట్ అవ్వడంతో హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టారు.
ఇది వరకే బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘సింహా’ లాంటి సూపర్ హిట్ సినిమా రావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఒక హీరోయిన్ గా ఎంపిక కాగా మరో హీరోయిన్ కోసం అన్వేషణలో ఉన్నారు. వారాహి ఫిల్మ్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు.