మార్చి 15న విడుదలవుతున్న బకరా

Bakara-Movie
శ్రీహరి హీరోగా నటించిన ‘బకరా’ సినిమా మార్చి 15న విడుదల కానుంది. కామెడి, సస్పెన్స్ తో సాగే ఈ సినిమాలో శ్రీహరి డాన్ గా కనిపించనున్నాడు. అభినయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బ్రహ్మనందం, రఘుబాబు, అలీ, ఎమ్. ఎస్., ధర్మవరపు, అలీ లపై తీసిన కామెడి సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని, అలాగే శ్రీహరి పై చిత్రీకరించిన పైట్స్ ఈ సినిమాకే హైలెట్ అవుతాయని డైరెక్టర్ తెలిపాడు. నిర్మాత మాట్లాడుతూ సామాన్య మానవుని జీవితంలో జరిగే సంఘటనల్ని ఈ సినిమాలో వినోదాత్మకంగా దర్శకుడు తెరకెక్కించాడని అన్నాడు. రుషిల్ మూవీస్ పై అప్పల కోటేశ్వర రావు, శివరామకృష్ణ లు నిర్మిస్తున్న ఈ సినిమాకి సి.ఎస్.అర్.కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి రోహిత్ ఆర్ కులకర్ణి సంగీతాన్నిఅందించాడు.

Exit mobile version