హైదరాబాద్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్

హైదరాబాద్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్

Published on Dec 17, 2012 4:30 PM IST

Back-Bench-Student
మధుర శ్రీధర్ దర్శకత్వంలో రానున్న చిత్రం “బ్యాక్ బెంచ్ స్టూడెంట్” ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. మహాత్ రాఘవేంద్ర, పియా బాజ్పాయి మరియు అర్చన కవి ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో వైజాగ్ మరియు హైదరాబాద్లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ని హైదరాబాద్లో మొదలు పెట్టుకుంది. “వాడి బ్రేకప్ లవ్ స్టొరీ” అన్న శీర్షికతో రానున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం ఒకేసారి తమిళంలో కూడా చిత్రీకరించబడుతుంది.గతంలో మధుర శ్రీధర్ “స్నేహ గీతం” మరియు “ఇట్స్ మై లవ్ స్టొరీ” వంటి చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ప్రధాన పాత్రల నడుమ హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం 2013 లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు