చిరంజీవి కోసం బాబా సెహగల్ పాట

చిరంజీవి కోసం బాబా సెహగల్ పాట

Published on Jul 14, 2013 7:00 PM IST

Baba-Sehgal
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి సింగర్ బాబా సెహగల్ ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వన్నున్నాడు. బాబా సెహగల్ ఇటీవలే చిరంజీవిపై ఓ పాటని రాశాడు, ఆ పాటకి ‘చిరు’ అని పేరు పెట్టాడని ఆయన తెలిపాడు. ” వినయంలో గ్రేట్ మాన్ అయిన చిరంజీవి గారి కోసం చేసిన సాంగ్ ‘చిరు’, త్వరలోనే రిలీజ్ అవుతుందని’ చెప్పాడు. బాగా పెప్పీగా సాగే ఈ టెక్నో బేస్ సాంగ్ ని చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగష్టు 22న రిలీజ్ చేస్తానని బాబా సెహగల్ తెలిపాడు. గత కొద్ది రోజుల క్రితమే బాబా సెహగల్ ‘పవ పవ పవన్ కళ్యాణ్’ అంటూ సాగే ఓ పాటని పవన్ కళ్యాణ్ కి ట్రిబ్యూట్ గా చేసారు. ఈ పాట పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. ఈ సారి చిరంజీవి కోసం ఎలాంటి పాటతో మనముందుకు వస్తాడో తెలియాలంటే చిరు బర్త్ డే వరకు ఎదురు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు