అల్లరి నరేష్ సినిమాలో బాబా సెహగల్ పాట

First Posted at 16:18 on Apr 17th

Baba-Sehagal

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పాపులర్ సింగర్ లలో బాబా సెహగల్ ఒకరు. ఈ ఎనర్జిటిక్ రాప్ స్టార్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ ‘యాక్షన్ 3డి’ సినిమాలో ఒక పాటని పాడారు. ‘మామ సైత మామ సైత’ అంటూ సాగే ఈ పాట సినిమాలో మొదటి పాట కావచ్చు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ -ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అల్లరి నరేష్, ‘కిక్’ శ్యాం, రాజు సుందరం, వైభవ్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని మేలో విడుదల చేయాలనుకుంటున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి బప్పి లాహరి, ఆయన కొడుకు బప్ప లహిరి లు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియోని ఈ శనివారం సాయంత్రం ప్రసాద్ మల్టీప్లెక్స్ లో విడుదల చేయనున్నారు.

Exit mobile version