పాప్ సింగర్ గా బాబా సెహగల్ కి మంచి పేరుంది. ఇప్పటి వరకూ బాబా సెహగల్ తెలుగులో కూడా సూపర్ హిట్ సాంగ్స్ ని పాడారు. ఇప్పటి వరకూ సింగర్ గానే అందరినీ ఆకట్టుకున్న బాబా సెహగల్ ఇప్పుడు గుణశేఖర్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘రుద్రమదేవి’ సినిమాతో నటుడిగా మారనున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో తన పాత్రను చూసి బాబా సెహగల్ థ్రిల్ అయ్యాడు. తాజాగా ఓ పత్రిక ప్రచురించిన సమాచారం ప్రకారం తను రుద్రమదేవి సినిమాలో చేసిన పాత్ర విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. అలాగే మరిన్ని సినిమాల్లో కూడా నటించాలనుకుంటున్నాడు. కానీ అక్కడే ఓ మెలిక కూడా ఉంది.. బాబా సెహగల్ కేవలం విలన్ లేదా నెగటివ్ రోల్స్ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
అలాగే బాబా సెహగల్ రుద్రమదేవిలో తన పాత్రకి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడానికి ఒప్పు కోలేదు. నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకుంటానని తెలిపాడు.