టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పీరియాడిక్ అడ్వెంచర్ గా తెరకెక్కనున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా ఈ నెలా చివరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. షూటింగ్ కి సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ముందుగా కొన్ని సింపుల్ గా ఉండే సీక్వెన్స్ లను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకి సంబందించిన అందరు సాంకేతక నిపుణులు ఫాంలోకి రాగానే ఫస్ట్ సాంగ్ ని షూట్ చేస్తారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి ప్రభాస్ కి బ్రదర్ గా కనిపించనున్నాడు. అనుష్క హీరోయిన్ గా నటించనుంది. ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.