బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!

బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డే్ట్..!

Published on Oct 27, 2025 6:01 PM IST

Baahubali The Epic

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ చిత్రం బాహుబలి, బాహుబలి-2 ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సినిమాల్లో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కొల్లగొట్టిన వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది బాహుబలి ఫ్రాంచైజీ.

అయితే, ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలోని రెండు సినిమాలను ‘బాహుబలి ది ఎపిక్’ అంటూ రీ-కట్ వెర్షన్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవగా, దానికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. అయితే, ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజ్ ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాహుబలి ది ఎపిక్ చిత్రంలో బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో లేని ఓ కొత్త సీన్ ఉండబోతుందని.. ఇది ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని తెలిపారు.

కాగా, అది కొత్తగా షూట్ చేసిన సీన్ కాదని.. ఎడిటింగ్‌లో తొలగించిన సీన్‌ను ఇప్పుడు మిక్స్ చేసి రీ-కట్ వెర్షన్‌లో యాడ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. దీంతో బాహుబలి ది ఎపిక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తున్నారు.

తాజా వార్తలు