బాహుబలి ట్రైలర్ విషయంలో క్లారిటీ ఇచ్చిన నిర్మాత

బాహుబలి ట్రైలర్ విషయంలో క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Published on Oct 31, 2013 3:42 PM IST

bahubali-first-look
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా, ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు.

ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ఓ టీజర్ ని విడుదల చేసారు. అది యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించింది. కానీ తాజాగా ఈ చిత్ర టీంపై అనుకోని ఆరోపణ ఒకటి మోపారు. ప్రస్తుతం ఓ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది, అది, బాహుబలి మేకింగ్ వీడియో దాదాపు ఒకేలా ఉన్నాయి.

దాంతో కొంతమంది టీవీ చానల్స్ వారు బాహుబలి మేకింగ్ వీడియోని దాని నుంచి కాపీ కొట్టారు తప్ప ఇందులో చెప్పుకోదగ్గ పనితనం లేదని ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలని ఈ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ఖండించారు.

‘మేము ఆ వీడియో టెంప్లెట్ ని అధికారికంగా కొనుగోలు చేసాము. మాకు లైసెన్స్ ఉంది. ఆ టెంప్లెట్ ని ఎవరన్నా కొనుక్కోవచ్చు. అది కాపీ కాదు. మేము అనుకున్నదానికి ఆ వీడియో టెంప్లెట్ బాగా సరిపోతుందని కొనుగోలు చేసామని’ ట్విట్టర్లో తెలిపాడు.

కమర్షియల్ గా ఉపయోగించుకోవడం కోసం అధికారికంగా టెంప్లెట్ ని కొనుగోలు చేసుకొని వాడుకోవచ్చు. శోభు యార్లగడ్డ ఇచ్చిన క్లారిటీతో ఈ వార్తలకి తెరపడింది.

ఆ రెండు వీడియోలను మీకందిస్తున్నాం…

బాహుబలి మేకింగ్ వీడియో

ఒరిజినల్ వీడియో

తాజా వార్తలు