రామోజీ ఫిల్మ్ సిటీలో ‘బాహుబలి’ షూటింగ్

రామోజీ ఫిల్మ్ సిటీలో ‘బాహుబలి’ షూటింగ్

Published on Aug 16, 2013 1:00 PM IST

Bahubali

ప్రముఖ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సినిమా ‘బాహుబలి’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. ఈ షూటింగ్ గత కొద్దిరోజులుగా అక్కడే జరుగుతోంది. కొన్ని ముఖ్యమైన టాకీ సన్నివేశాలను అక్కడ చిత్రికరిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ ఇంకా కొద్ది రోజులు జరుగే అవకాశం ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఈ సినిమాలో రానా దగ్గుపాటి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ రాజమాతగా నటిస్తోంది. వీరితో పాటుగా నాజర్, సత్యరాజ్, అడివి శేష్ కూడా నటిస్తున్నారు. పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండవచ్చునని భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఆర్క మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సంతిల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

తాజా వార్తలు