ఎన్టీఆర్ బాద్షా మరో షెడ్యూల్ మొదలు

ఎన్టీఆర్ బాద్షా మరో షెడ్యూల్ మొదలు

Published on Oct 13, 2012 8:50 PM IST


ఎన్టీఆర్ మరియు కాజల్ ప్రధాన పాత్రలలో రాబోతున్న పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం “బాద్షా” కాస్త విరామం తరువాత ఈ రోజు చిత్రీకరణ మొదలు పెట్టుకుంది.ఈ షెడ్యూల్ ఈ నెలాఖరి వరకు జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం యూరప్ , బ్యాంకాక్ మరియు హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంది శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కెల్లి దోర్జీ మరియు నవదీప్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాఫియ నేపధ్యంలో నడిచే ఈ చిత్రానికి గోపిమోహన్ మరియు కోన వెంకట్ కథను అందించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా కే వి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం 2013 మార్చ్ లో విడుదల అవుతుంది.

తాజా వార్తలు