ఖరారైన ఎన్.టి.ఆర్ ‘బాద్షా’ ఆడియో వేదిక

Badshah
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘బాద్షా’ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నవదీప్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఆడియోని మార్చి 10న సరికొత్తరీతిలో జరగనుందని ఇది వరకే తెలిపాము. ఈ ఆడియో వేడుక అత్యంత ఘనంగా హైదరాబాద్ నానక్రాంగూడాలోని రామానాయుడు స్టూడియోస్ లో జరగనుంది.

ఇటీవల కాలంలో వచ్చిన చాలా పెద్ద సినిమాల ఆడియో వేడుకలు ఇక్కడే జరిగాయి. ఈ ఆడియో వేడుకకి ఎంతో శోభాయమానాన్ని, జోష్ ని అందించే ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో మూడు పాటలను బాగా ఫేమస్ అయిన శింబు, దలేర్ మెహంది, బాబా సెహగల్ లు పాడారు. మరో ప్రక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version