ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి శివరాత్రి కానుక ఇదే..

Baadshah

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘బాద్షా’ సినిమా ఆడియో లాంచ్ వేడుక అనుకున్న దాని ప్రకారం మార్చి 10న జరగాలి కానీ సెక్యూరిటీ కారణాల వల్ల వాయిదా పడింది. దీనివల్ల చాలా మంది ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. అలాంటి వారందరికీ ఉత్సాహాన్ని అందించడానికి ప్రొడక్షన్ టీం మహా శివరాత్రి రోజు అనగా మార్చి 10న ఒక టీజర్, ఒక ప్రోమో సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ వార్త ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ లో మళ్ళీ నూతనోత్సాహాన్ని నింపింది.

శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా, ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ ఎంటర్ టైనర్ ‘బాద్షా’. ఈ సినిమాని ఏప్రిల్ 5 న భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Exit mobile version