అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న ‘బాద్షా’

అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న ‘బాద్షా’

Published on Apr 6, 2013 4:00 PM IST

Baadshah--001

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా సమ్మర్ స్పెషల్ గా విడుదలై అన్ని సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ అందరి మనసును దోచుకొంటోంది. హాలీడేస్ కావడంతో సిటీలో అన్ని థియేటర్స్ లో మరో మూడు రోజుల వరకు టికెట్స్ అన్ని అమ్ముడు అయ్యాయి. హాలీడే సీజన్ వల్ల హౌస్ కలెక్షన్లతో ప్రదర్శించ బడుతున్న ఈ సినిమాకి ఎన్.టి.ఆర్ స్టార్ ఇమేజ్ కూడా తోడైంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో కాజల్ అగర్వాల్, బ్రహ్మానందంలు ముఖమైన పాత్రలలో నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మించాడు. ‘గబ్బర్ సింగ్’ సినిమా సూపర్ హిట్ తరువాత వెంటనే బండ్ల గణేష్ ఖాతాలో మరో సూపర్ హిట్ సాదించిన సినిమా ‘బాద్షా.

తాజా వార్తలు