బాద్షా తమిళ్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న పివిపి సినిమాస్

బాద్షా తమిళ్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న పివిపి సినిమాస్

Published on Apr 8, 2013 12:10 PM IST

pvp
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరికొత్త స్టైలిష్ లుక్ లో, శ్రీను వైట్ల దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మాణ సారధ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘బాద్షా’. గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. నైజాం, సీడెడ్, కోస్తా, ఓవర్సీస్ అని తేడా లేకుండా విడుదలైన అన్ని ఎరియాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా తమిళంలో రీమేక్ చేస్తారని అంటున్నారు, ఎవరు కొన్నారు ఏంటి అనే విషయాలకు నేటితో తెరపడింది.

సౌత్ ఇండియన్ ఫేమస్ ఫైనాన్సియర్, పివిపి సినిమాస్ బ్యానర్ పై సినిమాలు నిర్మించే ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమా తమిళ్ రీమేక్ రైట్స్ ని ఒక ఫాన్సీ అమౌంట్ కి సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమిళ టాప్ స్టార్ విజయ్ హీరోగా నటించనున్నాడు. విజయ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ‘తలైవా’ సినిమా షూటింగ్లో బిజీ గా ఉన్నాడు. ఇండియాకి తిరిగి రాగానే ఈ సినిమాపై ఓ నిర్ణయం తీసుకుంటారు. ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయనున్నారు, హీరోయిన్ ఎవరు అనే వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

తాజా వార్తలు