యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన ‘బాద్షా’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఫుల్ ఫైర్ తో దూసుకుపోతూ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా కలెక్షన్స్ అన్ని ఎరియాల్లోనూ సూపర్బ్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో, ఎ సెంటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
అందరికీ తెలిసిన ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ బాద్షా సినిమా యు.ఎస్ లో 1 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసిందని రిపోర్ట్ చేసాడు. ఇది చాలా పెద్ద సక్సెస్, అలాగే ఓపెనింగ్ వీకెండ్ లోనే ఈ రికార్డ్ సాధించిన మొట్ట మొదటి తెలుగు సినిమా ‘బాద్షా’. కలెక్షన్స్ విషయంలో కీలకంగా చెప్పుకునే నైజాం ఏరియాలో కూడా కలెక్షన్స్ సాలిడ్ గా ఉన్నాయి.
‘బాద్షా’ అఫీషియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అని అనౌన్స్ చేసే సమయం ఆసన్నమైంది. ఎన్. టి.ఆర్ – కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. ఈ భారీ బడ్జెట్ సినిమాని పరమేశ్వర ఆర్ట్ పొడక్షన్స్ పై బండ్ల గణేష్ నిర్మించాడు.