బుల్లితెరపై ప్రసారమైన ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది అవికా గోరి. ఆ తర్వాత టాలీవుడ్‌లో పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ, ఇప్పుడు తాను ప్రేమించిన ప్రియుడితో నిశ్చితార్థం జరుపుకుంది.
అవికా గోర్ గత కొన్నేళ్లుగా బుల్లితెర నటుడు మిలింద్ చంద్వాణిని ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ మేరకు తమ నిర్ణయానికి యావత్ బాలీవుడ్ వర్గాలు అవాక్కయ్యాయి. ఇక ఆమె ఎంగేజ్‌మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు నిజంగానే పెళ్లి కూతురు కాబోతుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.