వేసవిలో రానున్న “ఆటోనగర్ సూర్య”

వేసవిలో రానున్న “ఆటోనగర్ సూర్య”

Published on Jan 11, 2013 1:00 PM IST

Auto_Nagar_Surya4 (11)
నాగ చైతన్య మరియు సమంత ప్రధాన పాత్రలలో రానున్న చిత్రం “ఆటోనగర్ సూర్య”. ఈ చిత్ర విడుదల వేసవికి వాయిదా పడింది. దేవ కట్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అచ్చి రెడ్డి నిర్మించారు. అర్ అర్ వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రం చాలా రోజులుగా నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం రెండు పాటలు మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఈ చిత్రం డిసెంబర్లోనే విడుదల కావలసి ఉండగా అప్పుడు విడుదల కాలేదు. ఈ చిత్రం గురించి దేవ కట్ట చెప్తూ “ఆటోనగర్ సూర్య చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తాం. ఈ చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది అని నాకు నమ్మకం ఉంది” అని అన్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అవినీతికి ఎదురు తిరిగిన ఒక యువకుడి కథ ఈ చిత్రం. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు