ఎవడు సినిమాలో ఆటోనగర్ సూర్య ట్రైలర్

Autonagar-Surya-Latest-Post
అక్కినేని నాగ చైతన్య నటించిన ‘ఆటోనగర్ సూర్య’ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ఆడియో ఈ నెల 19న మనముందుకు వస్తుంది. ఈ వేడుకకు వేదిక శిల్పకళా వేదిక . ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలకానున్న రామ్ చరణ్ ఎవడు ఇంటర్వల్ లో ప్రదర్శించనున్నారు

ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడే వెల్లడించాడు “యు.ఎఫ్.ఓ, పి.ఎక్స్.డి స్క్రీన్లలో ప్రదర్శితం కానున్న ఎవడు లో మా సినిమా ట్రైలర్ చూడచ్చు. క్యూబ్ సిస్టమ్ కు అప్లోడ్ చెయ్యలేకపోయామ్” అని ట్వీటిచ్చాడు

ఈ సినిమాలో సమంత హీరోయిన్. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఆర్ధిక సంబంధిత విషయాలవలన జాప్యం కలిగిన ఈ సినిమాకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్. ఆర్ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై ఆర్.ఆర్ వెంకట్ నిర్మిస్తున్నారు

Exit mobile version