నేటి రాత్రికి విడుదల కానున్న ఆటోనగర్ సూర్య ఆడియో

Auto_Nagar_Surya_Audio_Post
అక్కినేని నాగ చైతన్య హీరోగా అందాల భామ సమంత హీరోయిన్ గా నటించిన ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ చిత్ర ఆడియో వేడుకకి పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు హాజరు కానున్నారు.

ఈ చిత్ర ప్రొడక్షన్ హౌస్ ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు ఫైనాన్సియల్ గా పలు ఇబ్బందులను ఎదుర్కోవడం వల్ల ‘ఆటోనగర్ సూర్య’ ప్రొడక్షన్ టీం కూడా చాలా రోజులుగా ఇబ్బందులు ఎదుర్కుంటోంది. దాదాపు 90% పూర్తయిన ఈ సినిమా చివరికి వచ్చాక ఆగిపోయింది. కానీ ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ కొద్ది నెలల క్రితమే తిరిగి మొదలయ్యాయి. త్వరలో సినిమా కూడా విడుదల కానుంది. దేవకట్టా ఈ సినిమాకి డైరెక్టర్. మంచి డ్రామా, పవర్ఫుల్ డైలాగ్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ‘ఆటోనగర్ సూర్య’ ఉంటుందని అంటున్నారు.

Exit mobile version