రసవత్తరమైన యాక్షన్ డ్రామాగా ఆటోనగర్ సూర్య

రసవత్తరమైన యాక్షన్ డ్రామాగా ఆటోనగర్ సూర్య

Published on Feb 21, 2012 10:41 AM IST


యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’ చిత్ర షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్ర కొత్త షెడ్యుల్ ఈ నెల 27 నుండి హైదరాబాదులో ప్రారంభం కానుంది. విమర్శకులు మెచ్చే దర్శకుడు దేవకట్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దర్శకుడు ఈ చిత్రాన్ని మచి యాక్షన్ డ్రామా మరియు ఆసక్తి కలిగించే సంభాషణలతో చాలా బాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. నాగ చైతన్య మాస్ పాత్రలో నటిస్తుండగా సమంతా హీరొయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు