పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ”అతారింటికి దారేది” సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈ రోజు సాయంత్రం రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఒక వైరస్ లా అంతా పాకిపోయి ఇంటర్నెట్ లో సంచలాను సృష్టిస్తోంది. ఈ ఫస్ట్ టీజర్ లో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ లుక్ లో అలా నడుచుకుంటూ వస్తుంటాడు, బ్యాక్ గ్రౌండ్ లో ”వీడు ఆరడుగుల బుల్లెట్టు.. వీడు ధైర్యం విసిరినా రాకెట్టు” అని యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్ వస్తుంది. ఈ పాటలోని లైన్స్ అప్పుడే ఫ్యాన్స్ లో పెద్ద టాపిక్ అయ్యింది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. నదియా, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ ఆడియో ఆల్బం ని జూలై 19న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి