జాతీయ అవార్డుల రేసులో అత్తారింటికి దారేది, మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు

జాతీయ అవార్డుల రేసులో అత్తారింటికి దారేది, మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు

Published on Apr 12, 2014 10:07 PM IST

Atharintiki-Dharedhi,-SVSC,

పవన్ కళ్యాణ్, సమంత లు నటించిన అత్తారింటికి దారేది సినిమాతో పాటు పలు తెలుగు సినిమాలు ఈ ఏడాది జాతీయ అవార్డుల జాబితాలోకి ప్రవేశించాయి. ఈ జాబితాలో వివిధ భాషల సినిమాలు వున్నాయి. తెలుగు భాషనుండే 20 చిత్రాలు వున్నాయి

వాటిలో ప్రముఖమైనవి అత్తారింటికి దారేది, మిర్చి, సాహసం, ప్రేమకధా చిత్రమ్, మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఉయ్యాల జంపాల, అంతకుముందు ఆ తరువాత వంటి హిట్ సినిమాలే కాక బసంతి, జగద్గురు ఆది శంకర, స్వామి వివేకానంద, మిణుగురులు, కమలతో ప్రయాణం కూడా వున్నాయి. మే 3 న జరిగే 61వ జాతీయ అవార్డుల వేడుకలో విజేతలను ప్రకటిస్తారు

ప్రముఖ పాటల రచయిత గుల్జర్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. గత ఏడాది కేవలం ఈగ సినిమా మాత్రమె రెండు అవార్డులను సంపాదించుకుంది. మరి ఈ ఏడాది ఏమేమి సినిమాలు అవార్డులను గెలుచుకుంటాయో చూడాలి

తాజా వార్తలు