ఈ వారం బాక్సాఫీస్ అడ్డాలో ‘అతడు’ మాత్రమే దుమ్ములేపుతాడా..?

ఈ వారం బాక్సాఫీస్ అడ్డాలో ‘అతడు’ మాత్రమే దుమ్ములేపుతాడా..?

Published on Aug 6, 2025 3:00 AM IST

Athadu

ప్రతి శుక్రవారం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ కొత్త సినిమా రిలీజ్ కావడం షరా మామూలే. అయితే ఈ వారం బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. దీంతో కన్నడలో హిట్ అయిన ‘సు ఫ్రమ్ సో’ అనే సినిమాను డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ వారం ప్రేక్షకులు ఏ సినిమా చూడాలా అనే ఆలోచనలో ఉన్నారు.

ఇక వారందరికీ నేనున్నాను అంటూ వస్తున్నాడు మహేష్ బాబు. దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ హీరోగా నటించిన క్లాసిక్ కల్ట్ చిత్రం ‘అతడు’ ఆగస్టు 9న రీ-రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను భారీ ఎత్తున రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు మహేష్ అభిమానుల సందడి సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సాగుతోంది.

దీంతో ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ‘అతడు’ మాత్రమే దుమ్ములేపుతాడు.. అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రీ-రిలీజ్ ట్రెండ్‌లో వస్తున్న అతడు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

తాజా వార్తలు